09-01-2026 06:54:15 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం భవిత కేంద్రం, ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ ను జిల్లా విద్యాశాఖ అధికారి శారద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానసిక శారీరక వికలాంగుల పిల్లలకు ప్రత్యేకమైనటువంటి భవిత సెంటర్లో అందరితో పోటు సహిత విద్య అందించడమే లక్ష్యంగా ఏర్పాటు కాబడిన సుద్దాల గ్రామంలోని సెంటర్లో అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దబడినది. మానసిక వైకల్యం అనేది శరీరానికే కానీ మనస్సుకు కాదని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని జిల్లా విద్యాశాఖ అధికారి శారద కోరారు.
ఈ కార్యక్రమంలో భవితా పిల్లల తల్లిదండ్రులను శాలువతో సత్కరించడం జరిగినది. ఇలాంటి పిల్లలను ఓర్పుతో నేర్పుతో తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ మల్లేశం, సీఎమ్ఓ కవితా రెడ్డి, ఎంఈఓ రాజయ్య, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రత్నాకర్ రెడ్డి, సర్పంచ్ సంపత్ యాదవ్, ఉపసర్పంచ్ గుజ్జ సంపత్, గ్రామ కార్యదర్శి సాగర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.