03-05-2025 11:35:27 PM
పట్టణ సీఐ శశిధర్ రెడ్డి..
మందమర్రి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాలని పట్టణ సీఐ శశిధర్ రెడ్డి కోరారు. యాపల్ ఏరియాలో ఇటీవల తరచుగా ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం యాపల్ ఏరియా వాసులకు బీఆర్ఎస్ నాయకులు అబ్బాస్ అధ్యక్షత న నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిది గా పాల్గొని మాట్లాడారు. రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా చూసి రోడ్డు దాటలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాపిక్ నిబంధనలు పాటించాలని, సురక్షిత డ్రైవింగ్ చేయాలని, ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడుపరాదని ఆన్నారు. రోడ్డు అవతలి వైపుకు దాటేందుకు జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, జాతీయ రహదారి (363) అధికారులు, యాపల్ వాసులు పాల్గొన్నారు.