calender_icon.png 6 May, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వ కార్డుల పంపిణీ

03-05-2025 11:37:09 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో  తెలుగుదేశం పార్టీ మంతిని నియోజకవర్గ బాధ్యులు అందే భాస్కరాచారి క్రియాశీల సభ్యత్వ కార్డులను కార్యకర్తలకు అందజేశారు. భాస్కరాచారి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, ఈ సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకు కార్డులను అందజేస్తూ ఈ సభ్యత్వం పొందిన  కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి ద్వారా 5 లక్షల ప్రమాదభీమా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా వారి కుటుంబంలో 10సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వారిని డిగ్రీ వరకు యన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చదివిస్తామన్నారు. అదేవిదంగా పెళ్ళీడు ఆడపిల్లలు ఉంటే వారి వివాహానికి పట్టు వస్త్రాలు,రూ.25 వేల  ఆర్ధిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని మే నెల 5వ తేదీలోపు మండల,గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జీ ల నియామకం ఉంటుందని అదేవిదంగా పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ నియామకం ఉంటుందని తెలిపారు.తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు  జన్మదినం సందర్భంగా నిర్వహించే పార్టీ మహానాడు (ప్లీనరి)లోపు కమిటీలన్ని పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర నాయకులు వడ్లకొండ రాజశేఖర్, సీనియర్ నాయకులు డాక్టర్ మోరె సతీష్,నాగుల దర్మయ్య, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.