25 August, 2026 | 2:35 AM

రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలి

25-08-2026 01:36 AM

80 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేయాలి

ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి 

జవహర్‌నగర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): దమ్మాయిగూడనాగారం ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మెయిన్ రోడ్ ప్లాట్స్ అసోసియేషన్ స భ్యులు మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ను సోమవారం ఉదయం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ప్రతిపాదిత 100 అడుగుల రో డ్డును 80 అడుగులకు పరిమితం చేసి రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని వారు ఎంపీని కోరారు.

రహదారి పనులు ఆలస్యం కావడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సంజీవరెడ్డి, రామారం వెంకటేష్ గౌడ్, బాల్ రెడ్డి,వసుపతి నవీన్ గౌడ్, ఎల్లారెడ్డి , కృష్ణ, ఇమామ్ , సుబ్రహ్మణ్యం, నేమిచంద్ పవార్, గణేష్, పలువురు పాల్గొన్నారు.