1 August, 2026 | 1:05 AM

వారం రోజుల్లో రహదారి పనులు ప్రారంభం

01-08-2026 12:00 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెద్దమందడి, జూలై 31: రూ.40 కోట్లతో చేపట్టనున్న పెద్దమందడివనపర్తి రహదారి నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, మహిళా సంఘాల రుణాల మంజూరు, యూరియా సరఫరా, విద్యుత్ సేవలు, ఇంకుడు గుంతలు, ఫామ్పాండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.