1 August, 2026 | 1:07 AM

మంత్రి పొన్నంను కలిసిన బోయపల్లి

01-08-2026 12:00 AM

బడంగ్ పేట్  జులై 31: (విజయక్రాంతి): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. గురువారం మంత్రిని తన ఛాంబర్ లో రాఘవేందర్ రెడ్డి కలిసి, బడంగ్ పేట్ సర్కిల్ నాదర్ గుల్ డివిజన్ పరిధిలో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం విన్నవించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి, అంచెల వారిగా డివిజన్ పరిధిలో అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.