మార్చురీలో శృంగారం
- నోయిడాలో షాకింగ్ ఘటన
- స్వీపర్‌తో పాటు మరో ఇద్దరి అరెస్ట్
లక్నో, ఆగస్టు 23: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రభుత్వాసుపత్రి సెక్టార్ 94 మార్చురీలో స్ట్రెచర్లపై మృతదేహాలు పక్కనే ఉండగానే ఓ జంట శృంగారం చేస్తున్న వీడియో తాజాగా వెలుగు చూసింది. మార్చురీలో వారిద్దరూ నెల రోజుల క్రితం శృంగారంలో పాల్గొనగా ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియో ఎలా సోషల్‌మీడియాలోకి వచ్చిందో తెలియదు. వీడియోపై యూపీ వైద్యారోగ్యశాఖ సీరియస్‌గా స్పందించింది. శృంగారంలో పాల్గొన్న వారిలో పురుషుడు స్వీపర్ అని, అతడి పేరు షేర్ సింగ్ అని గుర్తించింది. అలాగే వీడియో చిత్రీకరించిన వ్యక్తి డ్రైవర్ భాను అని నిర్ధారించింది.
సదరు వీడియోలో ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి కూడా కనిపించాడు. కానీ శృంగారంలో పాల్గొన్న మహిళ వివరాలను మాత్రం వైద్యారోగ్యశాఖ గోప్యంగా ఉంచింది. వైద్యారోగ్యశాఖ ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు నిందితులు షేర్ సింగ్, భాను, ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 296, 67ఏ బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మరోవైపు మార్చురీలో భద్రత లేకపోవడంతో సిబ్బంది మృతదేహాలకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, మార్చురీకి ప్రతిరోజూ ఐదారు మృతదేహాలు వస్తాయని, ఇలాంటి పరిస్థితుల్లో మార్చురీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై నోయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ శర్మ స్పందిస్తూ.. ఘటనపై విచారణకు ముగ్గురు వ్యక్తులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, మార్చురీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.






