05-07-2025 02:15:58 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయ క్రాంతి): దివంగత మాజీ ముఖ్యమ ంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వ ర్యంలో లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో ఈ విగ్రహాన్ని నెలకొల్పా రు.
తొమ్మిది అడుగుల ఎత్తు, 450 కిలోల బరువు ఉన్న ఈ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా, విలువలతో కూడిన రాజ కీయాలకు చిరునామాగా రోశయ్య సుపరిచితులు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏకంగా 16సార్లు ఆర్థికశాఖ మంత్రి హో దాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత రోశయ్యకే దక్కుతుంది. ముఖ్యమంత్రిగానూ, తమిళనాడు గవర్నర్‌గానూ ఆయన అందించిన సేవలు చిరస్మర ణీయం.
రోశయ్య రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారని, ఆయన జీవితం ఆదర్శప్రాయమని ఖర్గే కొనియాడారు. విగ్రహావిష్కరణకు హాజరైన పలువురు నాయకు లు, ప్రముఖులు రోశయ్య సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్ర భాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్, టీజీ వెంకటేశ్, వీ హన్మంత్ రావు, కాల్వసుజాత పాల్గొన్నారు.