17-07-2025 12:31:19 AM
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే.విరాహత్ అలీ
గజ్వేల్: రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, గ్రామాలతో పాటు, అర్బన్ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. గజ్వేల్ జర్నలిస్టు కాలనీలో రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్(3150) ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, తాగునీటి బోరు మోటారును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సామాజిక సేవా దృక్పథంతో విభిన్న కార్యక్రమాలను చేపట్టడం హర్షణీయమన్నారు. విద్య, వైద్యంకు ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాలకు సేవలందించాలన్నారు. కాలనీలో పలు అవసరాలను కాలనీ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్, మధుసూదన్ రెడ్డి క్లబ్ దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క…