ఆల్ఫా హోటల్‌లో కుళ్లిన మాంసం
- తయారీ, గడువు తేదీల్లేకుండా ఐస్‌క్రీమ్‌లు, బ్రెడ్ ప్యాకెట్ల విక్రయం
రాజ్‌బార్ అండ్ రెస్టారెంట్ కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు
నిజామాబాద్‌లో కుళ్లిన చికెన్, ఆహార పదార్థాల స్వాధీనం
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
నిజామాబాద్, జూన్ 20 (విజయక్రాంతి)/కంటోన్మెంట్, జూన్ 20: ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం సికింద్రాబాద్, నిజామాబాద్ నగరాల్లోని పలు హోటళ్లలో తనిఖీ చేపట్టారు. సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్‌లో కుళ్లిన పచ్చి మాంసం, పాక్షికంగా తయారు చేసిన ఆహార పదార్థాలను నిలువ ఉంచడం, డస్ట్‌బిన్లు తెరిచి అపరిశుభ్రంగా ఉంచడం గుర్తించారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్‌క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్‌లు, టీ పొడి ప్యాకెట్‌లపై ఎలాంటి తయారీ తేదీలు, బ్యాచ్ నంబర్‌లు లేవు. వంటగదిలో శుభ్రతను పాటించడం లేదని తెలిసింది. గడువు తీరిపోయిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ నకలు కాఫీ ఉంది.
సదరు హోటల్ నిర్వాహకులు అధికారులకు సహకరించకపోవడంతో పాటు తనిఖీ రిపోర్టుల్లో సంతకం చేసేందుకు నిరాకరించారు. ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం 2006 క్లాస్ 62 ప్రకారం వారిపై కేస్ నమోదు చేస్తామని, దీనికి రూ.లక్ష జరిమానా, మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదే విధంగా రాజ్‌బార్ అండ్ రెస్టారెంట్‌లో కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు దర్శ నం ఇచ్చాయి. ఆహార పదార్థాల్లో వాడేందుకు నిలువ ఉంచిన సింథటిక్ కలర్స్ స్వా ధీనం చేసుకున్నారు. పాక్షికంగా వండిన ఆహార పదార్థాలు స్టోర్ చేసి ఉన్నాయి. సందర్శినిలో బెల్లంపై సరిగాలేని లేబుళ్లు వాడటం, గడువు ముగిసిన నూడిల్స్ ప్యాకెట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంద ర్భంగా ఆయా హోటళ్లలో శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపిం చినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టగా, నాలుగు రోజుల క్రితం చికెన్ లెగ్ పీసు లు, కుళ్లిన మాంసం, వారం క్రితం తయారు చేసిన గ్రేవీ, నిషేదిత టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎఁ ఎస్‌ఆర్ బార్‌పై ఫుడ్ సేప్టి అధికారి తార్యానాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బార్ రెస్టారెంట్‌లో నిల్వఉంచిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తాము చికెన్, మటన్ తో పాటు వడ్డించే గ్రేవిని వారం రోజులకు ఒక్కసారి వం డి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తామని వంట మనిషి తెలపడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.






