02-01-2026 07:45:50 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్
వనపర్తి,(విజయక్రాంతి): భూ కొలతలు అత్యంత ఖచ్చితత్వంతో కొలిచే రోవర్స్ పరికర పనితీరు పై పకడ్బందీగా శిక్షణ పొందాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్ అన్నారు. తెలంగాణ సిడిఎల్ఎ నిర్దేశించిన మేరకు భూ భారతి చట్టం ప్రకారం భుదార్ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లోని 70 గ్రామాల్లో ఎంజైమెంట్ సర్వే నిర్వహించేందుకు రోవర్స్ యంత్రాలను పంపడం జరిగింది.
జనవరి, 1, 2వ తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాలోని 10 మంది సర్వేయర్లను పోలీస్ పరేడ్ మైదానం లో చంద్రకాంత్ ట్రైనర్ శిక్షణ ఇవ్వగా శుక్రవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రివర్స్ యంత్రాన్ని ఉపయోగించి భూ కొలతలు ఏవిధంగా చేయాలి. ఎలాంటి ప్రామాణికలు తీసుకోవాలి అనే అంశాలను బాగా నేర్చుకోవాలని ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం జిల్లాకు (3) రోవర్స్ యంత్రాలు రావడం జరిగిందని అత్యంత ఖచ్చితరవంతో కొలిచే రోవర్స్ యంత్రాలను ఎలా ఉపయోగించాలో తరువాత కాలంలో లైసెన్స్ పొందిన సర్వేయర్లకు సైతం శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. భూభారతి కింద వనపర్తి జిల్లాలోని 70 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు గా ఎంజైమెంట్ సర్వే చేసి భుదార్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎ.డి.సర్వే ల్యాండ్ పి. శ్రీనివాస్, ఎస్.డి.యం శిల్ప, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.