calender_icon.png 2 January, 2026 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టండి

02-01-2026 07:57:56 PM

వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): గతంలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సిసిఎస్ పోలీసులకు ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సిటీ క్రైమ్ స్టేషన్ ను శుక్రవారం సిపి తనిఖీ చేశారు. తనిఖీల కోసం సిసిఎస్ కు చేరుకున్న సిపికి అధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు.

పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలించిన అనంతరం సీపీ పాత నేరస్తుల ఫోటోలు, స్టేషన్ రికార్డులను పరిశీలించి, చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను సీపీ సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు చోరీల నియంత్రణ కోసం చేపట్టాల్సిన ముందస్తూ చర్యలను అధికారులు సూచించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ చోరీ కేసుల్లో జైలు శిక్షపడ్డ ఖైదీలు, తిరిగి విడుదలయిన నిందితుల సమాచారం సేకరించాలని, ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన నిందితుల వివరాలను అందుబాటులో ఉండాలని సీపీ తెలియజేసారు. ఈ తనిఖీల్లో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ ఉన్నారు.