calender_icon.png 10 January, 2026 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాక్సిక్ నుంచి రాయ వచ్చాడు

09-01-2026 12:00:00 AM

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. యష్‌తో కలిసి ఈ కథను రాసిన గీతూ మోహన్ దాస్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్ట్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరోయిన్లు కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

గురువారం యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో యష్ నటించిన రాయ పాత్ర పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంది. ఓ శశ్మానంలో మాఫియా గ్యాంగ్ కాపలా కాస్తుంటారు. అక్కడి ప్రశాంత వాతారణంలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రాయ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. తనను తాను ఎవరికోసమో నిరూపించుకోవాలని చూసే వ్యక్తి కాదు రాయ.. ఆత్మవిశ్వాసంతో లక్ష్యంతో ముందుకు సాగే శక్తి అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఒకేసారి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో 2026 మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్; సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి; యాక్షన్: జేజే పెర్రీ; ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి; ప్రొడక్షన్ డిజైన్: టీపీ అబీద్.