calender_icon.png 7 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల బెడదను అరికడతామని ఎన్నికల్లో హామీ ఇవ్వాలి

07-12-2025 12:00:00 AM

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మనాభ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎంవీరెడ్డి

ముషీరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న కోతుల బెడదను అరికడతామనే హామీతో ప్రజల్లోకి ఓటు కోసం వెళ్లాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మనాభ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎంవీ రెడ్డిలు సూచించారు. ఈ మేర కు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోష ల్ మీడియా ఫోరంల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

మనుషులకు జనాభా లెక్కలు ఉన్నాయి కానీ, కోతులకు జనాభా లెక్కలు అంచనా వేయడం లేదని అన్నారు. కోతులు కరవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల లక్షల్లో కేసులు నమోదవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కోతులను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అడవులను నరకడం వల్లనే, కోతులు గ్రామాల్లోకి వచ్చి పంటలను నష్టం చేయడమే గాక, ఇండ్లలో చొరబడి తినుబండా లను ఎత్తుకెళ్లడమే గాక దాడులు చేస్తున్నాయని అని వారు వాపోయారు.

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జూ అథారిటీ ఆధ్వర్యంలో కోతులకు స్టెరిలైజేషన్ చేసి కేజీలు నిర్మించాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ విభాగాలు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని కోతులను జూలకు పారద్రోలేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (ఇండియా) అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ దేశాయ్, డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.