13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నెరవేరిన కల.. గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు

09-01-2026 03:33 PM

ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలి

పామండ తండా  సర్పంచ్ మాలి ఉమ్ల

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పామండ తండా గ్రామపంచాయతీలో ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఆ గ్రామస్తులకు బస్సు కళ నెరవేరింది. ఆ గ్రామస్తులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కాదు విద్యార్థులు, రైతన్నలు గ్రామాస్థూలు తమ అత్యవసరాల కోసం ప్రైవేట్ వాహనాల ద్వారానే రోడ్డు వరకు చేరుకుంటారు. ఆపై బస్సు లేదా ఆటోల ద్వారా మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది.

కానీ తాజా ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది అనుకున్నట్టుగానే ఆ గ్రామస్తుల బస్సు సౌకర్యం ఇప్పుడు సహకారమైంది. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పామండ తండా గ్రామానికి మహబూబాబాద్ నుండి సూర్యాపేట వాయా తాళ్ళుకల్ వయ తానంచర్ల మీదగా బస్సు సర్వీస్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు వర్షాకాలంతో పాటు మిగతా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రోజుల తరబడి విద్యార్థులు, మహిళలు పనుల కోసం ఖాళీ నడకన సైతం రోడ్డు వరకు వెళ్లేవారు అక్కడి నుండి రహదారి వరకు వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా తమ అవసరాలు నిమిత్తం పనులు చేసుకోనే వారని చెప్పారు. ఎమ్మెల్యే డోర్నకల్ రామచంద్రనాయక్ కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోతు ఈరాణి ,వార్డు మెంబర్లు బిచ్చు, నరేష్ ,బద్రి ,అరుణ ,సునీత, తండా పెద్దలు రెడ్డి, గోపి, వెంకన్న ,బాలరాజు, రెడ్డి ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.