09-01-2026 03:29:47 PM
మద్నూర్,(విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అహంకారపూరితంగా అవమానకరంగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ... దేశ ప్రజాస్వామ్యానికి మార్గదర్శకులైన రాహుల్ గాంధీ పై అలాగే ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పై ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు తగదని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.