calender_icon.png 18 July, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఏడి సమీక్ష

18-07-2025 07:09:45 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి పోలమన్  జోన్ పరిధిలోని ఐదు రీజియన్లకు చెందిన రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లతో  శుక్రవారం బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరములో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరము మొదటి త్రైమాసికంలో అన్ని రీజియన్ల పనితీరు, వర్షా కాలం ప్రారంభం అయినందున తీసుకోవలసిన జాగ్రత్తలు, రీజియన్ల నుండి వివిధ పర్యాటక ప్రదేశాలకు నడుపుచున్న టూర్ ప్యాకేజీ సర్వీసులకు ప్రయాణీకుల నుండి లభిస్తున్న ఆదరణను ఆయన సమీక్షించారు.