calender_icon.png 24 September, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట

24-09-2025 01:12:27 PM

హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్ పరీక్షపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission) దాఖలు చేసిన అప్పీళ్ల విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బుధవారం సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. అక్టోబర్ 15కి వాయిదా వేసింది. టీజీపీఎస్సీ తీసుకునే ఏవైనా తదుపరి చర్యలు అప్పీళ్ల తుది ఫలితానికి లోబడి ఉంటాయి. సెప్టెంబర్ 9న, సింగిల్ జడ్జి గ్రూప్-1 పరీక్షల తుది మార్కుల జాబితాను పక్కన పెట్టి, సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా పరీక్షలను కొత్తగా నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత వారం అప్పీల్ దాఖలు చేసింది. అదనంగా, సింగిల్ జడ్జి తీర్పుతో బాధపడుతున్న అనేక మంది ఎంపిక చేసిన అభ్యర్థులు కూడా వేర్వేరు అప్పీళ్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాల ప్రక్రియ జరిగిందని ఏజీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నేళ్లు తర్వాత జరుగుతున్న నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసిందని ఏజీ సూచించారు. తెలుగు అభ్యర్థుల పట్ల పక్షపాతం చూపించారనడానికి ఆధారాలు లేవని తెలిపారు.

6 ఆరోపణల ఆధారంగా సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిదని ఏజీ వెల్లడించారు. ఆరోపణలకు ఆధారాలను ఎవరూ చూపించలేకపోయారని పేర్కొన్నారు. కమిసన్ రూల్స్ ను ఉల్లంఘించినట్లు ఆధారాలున్నాయా అని సీజే ప్రశ్నించారు. కమిషన్ ఎక్కడా రూల్స్ ఉల్లంఘించలేదని ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ ఘటనలేమైనా జరిగాయా?, పక్షపాతం చూపించారనడానికి ఏమైనా ఆధారాలున్నాయా? అని సీజే జస్టిస్ ఏకేసింగ్ ప్రశ్నించారు. అలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఏపీ గ్రూప్-1 లోనూ తెలుగు అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని ఏజీ వెల్లడించారు. కోఠి మహిళా వర్సిటీలో పురుషులకు మూత్రశాలలు లేవని ఏజీ తెలిపారు. అందుకే ఆ రెండు కేంద్రాలను మహిళలకే కేటాయించినట్లు సూచించారు. దివ్యాంగులకు సమీపంలో ఉన్న కేంద్రాలు కేటాయించారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపును తప్పుపట్టలేమని సీజే ఏకేసింగ్ సూచించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీని కూడా తప్పుపట్టారని ఏజీ పేర్కొన్నారు. హాల్ టికెట్లు జారీ లోనూ టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని సీజే తెలిపారు.