24-09-2025 02:39:08 PM
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పాట్నాలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ, ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ... ఎన్డీఏ సర్కారు మొదటి నుంచి అబద్ధాలు చెబుతూనే వస్తోందన్నారు. మొదట్లో ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని మోసం చేశారని ఆరోపించారు. జీఎస్టీ సంస్కరణలు(GST reforms) అంటూ ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 8 ఏళ్లుగా అధిక జీఎస్టీతో ప్రజల నుంచి లక్షల కోట్లు పిండుకున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు చోరీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఖర్గే వెల్లడించారు. మోదీ హయాంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు..పేదలు మరింత పేదలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ లో డబుల్ ఇంజిన్ సర్కారుతో ప్రగతిని పరుగులు పెట్టిస్తామన్నారు. ఇప్పటి వరకు బిహార్ కు ఒక్క ప్యాకేజీ కూడా ప్రకటించలేదని ఖర్గే వివరించారు.