24-09-2025 01:37:33 PM
నంగునూరు: నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 26నాడు 'ఆరోగ్య మహిళ - ఉచిత వైద్య శిబిరం (Swasth Mahila Sashakth Parivar Abhiyaan) నిర్వహిస్తున్నట్లు పీహెచ్ సీ డాక్టర్ అంజలి రెడ్డి తెలిపారు. చిన్నపిల్లల వైద్యులు, జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, చర్మవ్యాధి, కంటి వైద్యులు, చెవి, గొంతు, ముక్కు వైద్యులు, మానసిక, దంత వంటి ప్రత్యేక వైద్య నిపుణులు హాజరవుతారని ఈ సేవలను నంగునూరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం 12:30 గం.లోపు తమ ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు.