24-09-2025 01:39:12 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు పోలీసుస్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డిని బోడు గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. స్టేషన్ పర్యవేక్షణకు వచ్చిన టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణను, బదిలీపై వెళ్లిన ఎస్సై శ్రీకాంత్ లను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్యా రాధా, సీనియర్ నాయకులు భూక్యా సైదులు, కేశెట్టి ఖాదర్ బాబు, ఇల్లందు ఆత్మ కమిటీ డైరెక్టర్ కుంజా సాంబయ్య, టేకులపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలువేరు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు రేఖ రామచంద్రం, వజ్జ పాపయ్య, అన్నారపు రవికుమార్, ఈసం రవీందర్, జి శ్రీనివాసరావు, పోదేం సుధీర్, చింత కళ్యాణ్, పూనెం వెంకటేశ్వర్లు, పూనెం దేవరాజు తదితరులు పాల్గొన్నారు.