24-09-2025 02:52:56 PM
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొట్టివేసింది. పేపర్‌లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా పిటిషన్ వేశారని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్త ం చేసింది. ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని కోర్టు ప్రశ్నించింది. పిటిషన్ అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్లపై(BC reservations) ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా అని ప్రశ్నించింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్ ఎలా వేస్తారని మొట్టికాయలు వేసింది. మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదని సూచించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికావార్తలను పరిగణలోకి తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది.