calender_icon.png 24 September, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైలో అగ్నిప్రమాదం

24-09-2025 01:47:33 PM

ముంబై: ముంబైలోని కుర్లా ప్రాంతంలోని ఒక మురికివాడలోని కొన్ని గుడిసెలలో బుధవారం మధ్యాహ్నం మంటలు( Fire Accident ) చెలరేగాయని అధికారులు తెలిపారు. కుర్లా వెస్ట్‌లోని జారిమారి రోడ్డులో ఉన్న సేవక్ నగర్‌లోని గుడిసెలలో మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి చేస్తున్నారని పౌర అధికారి తెలిపారు. మంటలు ఐదు నుండి ఏడు గుడిసెలకే పరిమితమయ్యాయని, అగ్నిమాపక చర్య కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించింది.