calender_icon.png 24 September, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆఫీసుకు నిప్పు.. లడఖ్‌లో ఉద్రిక్త పరిస్థితి

24-09-2025 02:09:32 PM

లెహ్లడఖ్‌ రాజధాని లేహ్ లో(Ladakh Violence) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లేహ్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఆందోళన కారులు నిప్పుపెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బుధవారం జరిగిన భారీ నిరసన, బంద్ మధ్య యువకుల బృందం హింసాత్మకంగా మారి రాళ్ళు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

లాఠీ ఛార్జ్ చేశారు. ఆరవ షెడ్యూల్ పొడిగింపుతో పాటు లడఖ్‌కు రాష్ట్ర హోదాపై కేంద్రంతో ప్రతిపాదిత చర్చలను ముందుకు తీసుకెళ్లాలనే డిమాండ్‌కు మద్దతుగా ఈ నిరసన జరిగింది. అక్టోబర్ 6న కేంద్రం, లెహ్ అపెక్స్ బాడీ (Leh Apex Body), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) సభ్యులతో కూడిన లడఖ్ ప్రతినిధుల మధ్య కొత్త రౌండ్ చర్చలు జరగనున్నాయి. సెప్టెంబర్ 10 నుండి 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరి పరిస్థితి మంగళవారం సాయంత్రం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించడంతో ఎల్ఏబీ యువజన విభాగం నిరసన,  బంద్‌కు పిలుపునిచ్చింది. వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలోని నిరాహార దీక్ష కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతున్నాయి.