calender_icon.png 15 May, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కరాలలో ఆర్టీసీ వైద్య శిబిరం

15-05-2025 02:07:31 AM

కరీంనగర్ క్రైం, మే14 (విజయక్రాంతి): సరస్వతీ పుష్కరాలలో విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా. ఏ.వి గిరిసింహారావు తెలిపారు. కాళేశ్వరంలోని ప్రత్యేక ప్రయాణ ప్రాంగణంలో ఈ వైద్య శిభిరం కొనసాగుతుందని మే15 నుండి 26 వరకు జరిగే ఈ శిబిరాన్ని సిబ్బంది వినియోగించుకోవాలని సూచించారు.

కరీంనగర్ జోన్ లోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్ లలోని ఆర్టీసీ ఉద్యోగులందరూ వినియోగించుకునే సదుపాయం కలదని తెలిపారు. వడదెబ్బ గాస్ట్రోఎంటరైటిస్ కి లోనుకాకుండా శుభ్రమైన నీటిని ఆహారాన్ని తీసుకోవాలని&మాస్క్ ధరించాలని& ఏ మాత్రం నలతగా ఉన్నా పక్కన ఉన్న వైద్యశిబిరాన్ని సంప్రదించాలని ప్రయాణికులు భక్తులకు సూచించారు.