15-05-2025 02:08:24 AM
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్దిపేట, మే 14 (విజయక్రాంతి): మల్కా జ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేద ని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తు ఇమామ్ విమర్శించారు. బుధవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటెల రా జేందర్ దివాలాకోరు రాజకీయం చేస్తూ నో టికొచ్చినట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉం దన్నారు.
నోరు అదుపులో పెట్టుకొని మా ట్లాడితే గౌరవం దక్కుతుందన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి పై అనుచిత వాక్యాలు చేస్తే తగిన శాస్త్రి చెల్లిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముద్దం లక్ష్మి, గంప మహేందర్ రావు, దేవులపల్లి యాదగిరి, మార్క సతీష్ గౌడ్, రజిని, సన, సలీం, సాయి, ప్రతాప్,తదితరులు పాల్గొన్నారు.