25-07-2025 02:06:21 AM
కరీంనగర్ క్రైం, జూలై 24 (విజయ క్రాంతి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనిరిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి. రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మా నించారు.
ధర్మపురి నియోజకవర్గంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన బస్సులను ఏర్పా టు చేయాలని మంత్రి సూచించారు. రీజనల్ మేనేజర్ వెంట కరీంనగర్ రీజియన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, కరీంనగర్ - 2 డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్‌ఉన్నారు.