25-07-2025 02:07:46 AM
మంత్రి వివేక్ వెంకటస్వామి
ఖైరతాబాద్: జూలై 24 (విజయ క్రాంతి): భవన నిర్మాణ కార్మికులకు రాష్ర్ట ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. భవన మనదారుల హక్కులు సంక్షేమం కోసం రూపుదిద్దుకున్న బిఓసి చట్టం1996 కరపత్రాన్ని కార్మిక నాయకులు ద్యాగటి హరీశ్, బత్తుల రాజశేఖర్ లతో కలసి గురువారం సచివాలయంలోని ఆయన చాంబర్ లో ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..బిఓసి చట్టం భవన నిర్మాణ కార్మికుల జీవితాన్ని మార్చే పునాది రాయి అని అన్నారు. అన్ని రంగాల కార్మికులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.కార్మికులకు సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తిరుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కలికోట సత్యనారాయణ, కార్మిక నాయకులు ఇప్పలపల్లి మహేష్, బత్తుల సంపత్, ముల్కల అరవింద్, విలాసాగరం పృథ్వీ, బూట్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.