6 April, 2026 | 11:12 AM

ఆకట్టుకున్న ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్

14-05-2024 02:21 AM

జయశంకర్ భూపాలపల్లి, మే 13 (విజయక్రాంతి): భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల కేంద్రంలో 166వ పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్  ఓటర్లను ఆకట్టుకుంది. పర్యావరణహితంగా కొబ్బరి, అరటి ఆకులు, బంతిపూల తోరణాలతో పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఓటర్లు సెల్ఫీ పాయింట్ వద్దకు వెళ్లి ఫొటోలు, సెల్ఫీలు దిగారు.