24-06-2025 01:51:07 AM
నూతన జేఏసీ ఏర్పాటుకు సిద్ధమైన సంఘాలు
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): నేడు ఆర్టీసీ కార్మిక సంఘా ల కీలక భేటీ జరుగనుంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ జేఏసీని రద్దు చేసి అన్ని సంఘాలతో కలిపి నూతన జేఏసీ ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సంఘాలన్నీ నిర్ణయం తీసుకున్నాయి. కొత్త జేఏసీ ఆధ్వర్యంలో మరింత ప్రభావవంతంగా పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటు న్నామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇవాళ అన్ని సంఘాల ముఖ్య నేతలు ఇదే హాలులో జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం సమావేశం అవుతున్నాయి.