24 April, 2026 | 1:47 AM

రెండో రోజు ఆర్టీసీ కార్మికుల నిరసన

24-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె గురువారం నాటికి రెండు రోజులకు చేరుకుంది. నిర్మల్ బైంసా డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు.

డిమాండ్ పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు వెల్లడించారు. ఇదిలా ఉండగా రెండో రోజు నిర్మల్ బైంసా డిపో పరిధిలోని అద్దె బస్సులను ప్రధాన రూపంలో పార్టీ అధికారులు తాత్కాలిక సిబ్బందితో నడిపించారు. బస్ డిపో వద్ద సిఐ సమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిర్మల్ బస్టాండ్ లో గురువారం సాయంత్రం బస్సుల కోసం ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం పూట బస్సులు నడవడంతో నిర్మల్కు వచ్చిన ప్రజలకు సాయంత్రం బస్సులు లేకపోవడంతో వచ్చిన బస్సుల కోసం పోటీపడుతూ మహిళలు పురుషులు ఏకపడ్డారు. కొన్ని రూట్లో బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.