30-12-2025 09:35:19 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం తెల్లవారుజామున తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సాయి పటేల్ తదితరులు వున్నారు.