calender_icon.png 27 October, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమర పోలీసుల త్యాగాలు మరువలేనివి

27-10-2025 06:48:22 PM

హుస్నాబాద్ ఏసీపీ సదానందం

పోలీసు అమరుల స్మరణార్థం విద్యార్థులతో సైకిల్ ర్యాలీ

హుస్నాబాద్: సమాజం కోసం పనిచేస్తూ అసాంఘిక శక్తుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసుల త్యాగాలు మరువలేనివని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం హుస్నాబాద్ లో విద్యార్థులు, యువకులతో కలిసి పోలీసులు ఉత్సవంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసులు త్యాగధనులన్నారు.

దేశ రక్షణ, ప్రజా శాంతి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అమరవీరులు చేసిన గొప్ప త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలతో పోలీసుల సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ఇవి దోహదపడతాయన్నారు. పోలీసు వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆశయాలను కొనసాగించేలా పోలీసులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.