calender_icon.png 29 September, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

29-09-2025 08:28:25 PM

మల్యాల (విజయక్రాంతి): మల్యాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మల్యాల, తక్కళ్లపెల్లి, తాటిపల్లి, మ్యాడంపెల్లి, ముత్యంపేట, మద్దుట్ల, మహిళలు బతుకమ్మలను పెట్టి ఆటలు, ఆడుతూ పాటలు పాడారు. తీరు ఒక్క పువ్వుని పెట్టి మహిళలు పేర్చిన సద్దుల బతుకమ్మ చుట్టూ చేరి పాటలతో అలరించారు. మండలంలోని గ్రామాల్లో సైతం సద్దుల బతుకమ్మ ఆటలను మహిళలు పాడారు. స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను తీసుకెళ్లి భోజనాలు చేశారు. తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగ బతుకమ్మ మీద గౌరవంతో తక్కలపల్లి గ్రామానికి చెందిన కోయిల లచ్చవ్వ-రాజయ్య తొమ్మిది పీట్ల బతుకమ్మను పేర్చినారు. మళ్లీ రా గౌరమ్మ మా ఇంటి కంటూ మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు.