calender_icon.png 29 September, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గమ్మకు బోనాల ఊరేగింపు..

29-09-2025 08:40:25 PM

ఊరూరా ఘనంగా పూజలందుకుంటున్న దుర్గమ్మ 

పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మండల కేంద్రం పాపన్నపేటతో పాటు యూసఫ్ పేటలో అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పసుపు, కుంకుమ, వేప కొమ్మలు నైవేద్యంతో అందంగా తీర్చిదిద్దిన బోనాలను మహిళలు నెత్తిన పెట్టుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. యువకులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. బోనాల ఊరేగింపులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దుర్గమ్మ నామాస్మరణలతో గ్రామాలు మారుమోగాయి.