calender_icon.png 29 September, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ ట్యాంక్ బండ్ లా పొనుగోడు చెరువు

29-09-2025 08:37:56 PM

సుందరీకరణ సంతరించుకున్నా పొనుగోడు చెరువు

కట్టను పార్కుల తీర్చిదిద్దుతాం: జోగు సరోజిని పిచ్చిరెడ్డి

గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని పొనుగోడు గ్రామంలో జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ చెరువు నూతన శోభను సంతరించుకుని మినీ ట్యాంక్ బండ్ గా సుందరంగా తీర్చిదిద్దుకుంది. గ్రామానికి చెందిన జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.4 లక్షల ఖర్చుతో చెరువు కట్టకు మెట్లు, ఏర్పాటు చేసి, రాష్ట్ర పండుగ బతుకమ్మకు చిహ్నంగా బతుకమ్మను ఎత్తుకున్న మహిళా, విగ్రహాన్ని కట్టపై ఏర్పాటు చేశారు. మహిళలు అలాగే బతుకమ్మ ఆడేందుకు వీలుగా చెరువు కట్టను శుభ్రంగా చేసి, నీటిలో బతుకమ్మలను వదిలెందుకు వీలుగా మెట్ల సౌకర్యంతో పాటు, పర్యాటక ప్రదేశంగా చెరువు కట్టను తీర్చిదిద్దారు. ప్రజలు సాయంత్రం వేళ సేద తీరేలా కట్టపై సందర్శకులు కూర్చొని అందాలను వీక్షించేందుకు బళ్లాలను ఏర్పాటు చేశారు. త్వరలో పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్కులా కట్టను తీర్చిదిద్దుతామని  ఫౌండేషన్ కోశాధికారి జోగు అరవింద్ రెడ్డి తెలిపారు.