calender_icon.png 29 September, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు

29-09-2025 09:30:07 PM

నకిరేకల్ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల గ్రామంలోని వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన  అమ్మవారి వద్ద నకిరేకల్ సీఐ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. సరస్వతీ పూజ అనంతరం చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. అనంతరం సీఐని, పంచాయతీ కార్యదర్శి మధును యువజన మండలి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్, యువజన మండలి అధ్యక్షుడు కొల్లు వివేక్‌, సీనియర్‌ సభ్యులు రామ్‌నారాయణ, సైదులు, మాజీ అధ్యక్షులు కోటగిరిరామకృష్ణ, పుట్ట సాయి, రాజు, కొప్పు భరత్, నర్సింగ్ నాగరాజు, కోటేషు, నాగారం శ్రీకాంత్‌ తాడ్వాయి సంపత్‌, పుట్ట విజయ్ పలువురు యువజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.