calender_icon.png 29 September, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే

29-09-2025 09:01:43 PM

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. ‘గలగల పారే గోదావరి గట్టుతో కళకళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలిచూపులోనే అబ్బాయికి ప్రేమ పుడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది

ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌ను హీరో ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తోంది. 

‘లంకలోని సీత కోసం రాముడు సముద్రాలు దాటినట్లు.. నీ సైకిల్ పాప కోసం నువ్వు ఈ గోదారి దాటుతున్నావన్నమాట’ ఈ డైలాగ్ చూస్తే తన మనసుకు నచ్చిన ప్రేయసి కోసం హీరో గోదారి దాటి వెళ్లి అన్వేషిస్తాడని. దానికి తగినట్లుగానే సన్నివేశాలను చూపించారు. 

చివరకు హీరోయిన్ కనపడగానే హీరో పడే భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

‘ఆడపిల్లలు మన జీవితంలోకి కోరికలతోను, ఆశలతోను రారురా.. జీవితంలో తోడుగా ఉంటామని భరోసాతో వస్తారు.. మనతో చెయ్యట్టుకుని ఏడడుగులు నడుస్తారు’ 

‘నాకు ఊహ తెలియని వయసు నుంచి నా అనుకున్న బంధం నాన్న.. ఉహ తెలిసిన తర్వాత నా అనుకున్న బంధం మీరు’ అంటూ హీరోయిన్‌కు హీరో తన ప్రేమను చెబితే, ‘ఇంత ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాదుగా రాఘవ’ అంటూ హీరోయిన్ ప్రేమగా హీరోను రిక్వెస్ట్ చేసే సన్నివేశం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలియజేస్తోంది. 

‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ అని హీరోకు తండ్రి చెప్పటం చూస్తే ప్రేమలో హీరోకు ఎదురైన సమస్య గురించి తెలుస్తుంది. 

అక్కడి నుంచి మనకు విలన్ పాత్ర ఎలా ఉండబోతుంది.. తన వల్ల హీరో పడ్డ ఇబ్బందులను ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు.

‘జాగ్రత్తగా వెళ్లి.. జాగ్రత్తగా తిరిగి రా’ అంటూ హీరోకి హీరోయిన్ జాగ్రత్త చెప్పటం, ‘ప్రేమతో వెళ్తున్నా.. వచ్చాక ప్రపంచాన్నే గెలుద్దాం’ అని హీరో చెప్పటం.. దానికి హీరో నుంచి హీరోయిన్ ప్రామిస్ తీసుకోవటంతో ట్రైలర్ ముగిసింది. 

గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలోని సన్నివేశాలు ట్రైలర్‌లోనే హృదయాలను హత్తుకుంటుంటే సినిమాలో భావోద్వేగాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్‌దేవ్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. సాయికుమార్ దారా అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్; నేపథ్య సంగీతం: అనుదీప్ దేవ్; కెమెరా: శ్రీసాయికుమార్ దారా; ఎడిటింగ్: గ్యారీ బీహెచ్; సమర్పణ: గౌరీ నాయుడు; నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోదాల; దర్శకుడు: సాయి మోహన్ ఉబ్బన.