calender_icon.png 29 September, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శివంపేట మండలంలో బతుకమ్మ వేడుకలు..!

29-09-2025 08:25:01 PM

సద్దుల బతుకమ్మ అలంకరించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి..

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండలంలో వివిధ గ్రామాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. అందులో భాగంగా శివంపేట గ్రామంలో సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆడపడుచులు అన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలంలోని స్వగ్రామమైన గోమారంలో బతుకమ్మను అలంకరించారు. ప్రతీ సంవత్సరంలాగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఈ ఏడాది కూడా తన కుటుంబ సభ్యులందరితో కలిసి తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. నియోజకవర్గ, మండల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.