29-09-2025 08:52:26 PM
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజాసాబ్” ట్రైలర్ వచ్చేసింది. ఫన్, ఫియర్ తో పాటు వింటేజ్ ప్రభాస్ ను ఆల్ట్రా స్టైలిష్ గా చూపించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ను ఒక హిప్నాటిస్ట్ ఓ భారీ హవేలీలోకి తీసుకెళ్తడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. దానికి కారణం తాత (సంజయ్ దత్). సైకలాజికల్ గా అన్ని విద్యలు తెలిసి, ప్రేతాత్మలను నియంత్రిస్తూ బ్రెయిన్ తో గేమ్ ఆడుకునే ఆ తాత శక్తిని ఎదుర్కోవడం అసాధ్యం.
‘అబీ దేఖ్ లీజీయే...’ అంటూ ఆ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు రాజాసాబ్ గా ఓ విలాసవంతమైన భవంతిలోకి అడుగుపెడతాడు ప్రభాస్. రాజాసాబ్ లుక్ లో ప్రభాస్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ వన్స్ మోర్ అనేలా ఉంది. హవేలీలో జరిగిన ప్రతి ఘటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా పిక్చరైజ్ చేశారు దర్శకుడు మారుతి.
హారర్ ఎలిమెంట్స్ తోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో ప్రభాస్ చేసిన ఫన్, రొమాంటిక్ సీన్స్ మరో ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా ఏదో గుర్తుండిపోయే పనిచేయాలి.. సంచలనమైపోవాలి.. ఏంట్రా ఇలాంటి పనిచేశాడని అందరూ షాకైపోవాలి’ వంటి డైలాగులు ఆకర్షణీయంగా ఉన్నాయి.
మొత్తంగా మారుతి.. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో వింటేజ్ ప్రభాస్ తో ఒక ఫుల్ మీల్స్ లాంటి మూవీని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్త దితరులు వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ కార్తీక్ పళని, మ్యూజిక్ తమన్.