calender_icon.png 29 September, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే ఆయన లక్ష్యం

29-09-2025 08:50:15 PM

నిరుపేదలకు ఎల్లవేళలా అండగా  హనుమన్న గారి నరేందర్ రెడ్డి

వెల్దుర్తి (విజయక్రాంతి): ఎవరూ లేని వృద్ధుల బాధలను చెప్పలేం. వెల్దుర్తి మండలంలోని మానేపల్లి గ్రామంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిరోజు నరేందర్ రెడ్డి సమయానికి 30 మంది వృద్ధులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోజూ గ్రామంలో ఎవరూ లేని, కుటుంబ ఆదరణకు నోచుకోని సుమారు 30 మంది వృద్ధులకు స్వయంగా తన ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. కుల మతాల పట్టింపులు లేకుండా అవసరమైన వారందరికీ భోజనాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామంలోని 30 మంది వృద్ధులకు బతుకమ్మ పండుగ సందర్భంగా కొత్త బట్టలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధులకు, ఆర్థికంగా వెనకబడిన వారికి సేవ చేయాలనే ఆశయంతో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఆయన తెలిపారు. ఇంకా మునుముందు ఇటువంటి కార్యక్రమాలు నిరుపేదలకు చేస్తానని, ఆయన మీడియాతో తెలపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.