18-07-2025 08:20:01 PM
చండూరు,(విజయక్రాంతి): గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం (సేఫ్టీ కిట్లు ) సంజీవని చండూరు ఎక్సైజ్ ఎస్సై కుర్మా నాయకులు అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ప్రతి గీత కార్మికుడు సేఫ్టీ కిట్లు వినియోగించుకోవాలని, వాటి ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. అనంతరం గీత కార్మికులసంక్షేమం కొరకు కృషి చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు గీత కార్మికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.