calender_icon.png 19 July, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో షుగర్ బోర్డ్స్ ఏర్పాటు

18-07-2025 08:23:43 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో సీబీఎస్ఈ నియమావళి ప్రకారం ఏర్పాటు చేసినటువంటి షుగర్ బోర్డులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా షుగర్ బోర్డులను ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.