28-07-2025 12:00:00 AM
రాష్ట్ర సగరుల సంఘం అధ్యక్షుడు శేఖర్ సాగర్
వనపర్తి టౌన్ జులై 27:తెలంగాణ లోని సగరులను బీసీ డి నుండి బిసి ఏ లకు మార్చేందు కు రాష్ట్ర ముఖ్యమంత్రి తో చొరవ తీసుకుని కృషి చేస్తామని రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షు లు జి. చిన్నా రెడ్డి, ఎమ్మెల్యే లు తూడి మేఘా రెడ్డి,మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సగర సంగం ప్రమాణస్వీకారంలో పాల్గొని వనపర్తి జిల్లా సగర సంగం అధ్యక్షుడిగా ఎన్నికైన మోడల తిరుపతయ్య సాగర్ నీ సంఘం సభ్యులను ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు శే ఖర్ సాగర్ మాట్లాడుతూ సాగరులను బీసీ డీ నుండి బీసీ ఏలకు మార్చేలా కృషి చేయాలని ఆ యన ఎమ్మెల్యేలను కోరారు. మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులకు అధిక సంఖ్యలో సర్పంచులు మరియు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసి సీట్లు కేటాయించాలని కో రారు.తదనంతరం ఎమ్మెల్యే లు మాట్లాడుతూ సగరులను బీసీ డీ నుంచి బీసీ ఏ లకు మార్చే విధంగా ముఖ్యమంత్రితో చొరవ తీసుకొని కృషి చేస్తానని తెలిపారు.
వనపర్తి నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్ పైన భగీరథ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు అదే విధంగా రా బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరుల ప్రాతిపదికన సీట్లో కేటాయించి ఇస్తానని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయా చైర్మన్ గోవర్ధన్ సాగర్ ,వనపర్తి మార్కెట్ కమిటీ చై ర్మన్ శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొబ్బూరి చంద్రయుడు సాగర్,జిల్లాల, పట్టణాల,మండలాల అధ్యక్షులు తదితర సాగర్లు పాల్గొన్నారు.