calender_icon.png 28 July, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానితుల వేలిముద్రలు సేకరణ

28-07-2025 12:00:00 AM

రాజాపూర్ జులై27: నేరం చేసి తరువాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగే నేరస్తులను పోలీస్ వ్యవస్థ వదిలిపెట్టదని ఎస్త్స్ర శివానంద్ గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని ముదిరెడ్డి పల్లి గ్రామంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల ఫింగర్ ప్రింట్ స్కానర్ చేసినట్లు తెలిపారు.

దొంగతనాలకు పాల్పడి చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఫింగర్ ప్రింట్ డివైసెస్ స్కానర్ ద్వారా వాళ్లను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. అలాగే కోర్టుకు హాజరు కాకుండా నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లో ఉన్న వ్యక్తులను కూడా దీని ద్వారా గుర్తించడం జరుగుతుందని తెలిపారు. పాత నేరస్తులను పట్టుకోవడం వేలిముద్రలు స్కాన్ చేస్తున్నట్లు తెలిపారు.