calender_icon.png 16 August, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నం!

14-08-2025 01:07:58 AM

- అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు

- సమగ్ర ప్రణాళికతో వస్తే అభినందిస్తాం

- కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

- తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : చెట్లను తొలగించిన కంచ గచ్చిబౌలి అటవీ భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న కంచ గచ్చబౌలి భూములపై అపెక్స్ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ భూముల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలపై గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మ ను సింఘ్వి వాదిస్తూ.. గతంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో చెట్ల నరి కివేతను నిలిపివేసిట్లు ధర్మాసనానికి తెలిపా రు.

అవసరమైన అభివృద్ధికి వీలు కల్పిస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించే సమ్రగ అభివృద్ధికి ప్రణాళికతో పనిచేస్తోందని వివరించా రు. అడవులు, సరస్సులను రక్షించడానికి ప్ర ణాళికను రూపొందించాలనుకుంటామని, దీనికి కొంత సమయం పడుతుందని వాదించారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ అభివృద్ధికి, ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అయితే అవి స్థిరంగా ఉండాలని బెంచ్ పునరుద్ఘాటించిం ది.

అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటపుడు పర్యావరణ పరిరక్షణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కంచ గచ్చబౌలి భూముల్లో చెట్లు తొ లగించిన వందల ఎకరాల భూమి అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముం దుకు వస్తే.. గతంలో అధికారులపై, ప్రభుత్వంపై తాము చేసిన వ్యాఖ్యలను ఉపసంహ రించుకుంటామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తామని సీజేఐ పేర్కొన్నా రు.

అంతేకాక తొలగించబడిన చెట్ల స్థానం లో అడవిని పునరుద్ధరించాలని ఆదేశించిం ది. పర్యావరణాన్ని పరిరక్షించాలని తాము కోరుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ఒక సమతుల్య ప్రణాళికను సమర్పిస్తే.. సు మోటోగా విచారణను ఉపసంహరించుకోవడాన్ని కోర్టు పరిశీలిస్తుందని సీజేఐ హామీ ఇచ్చారు.

తన రిటైర్‌మెంట్ లోపల వీటన్నింటికి పరిష్కారం చూపాలని సూచించారు. అయితే సమగ్ర ప్రణాళిక తయారు చేసి కోర్టుకు అందించడానికి తమకు ఆరు వారా ల సమయం ఇవ్వాలని కోర్టును ప్రభుత్వం కోరింది. దీంతో సుప్రీంకోర్టుకు అంగీకరించి తదుపరి విచారణను ఆరువారాలకు వాయి దా వేసింది. 

రాత్రికి రాత్రే చెట్ల తొలగింపు

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాం తంలో ఐటీ పార్క్ అభివృద్ధి కోసం హెచ్‌సీయూలోని దాదాపు వంద ఎకరాల అటవీ భూముల్లో రాత్రికి రాత్రే ఎక్స్‌కవేటర్లతో చెట్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో దేశమంతా పర్యావరణ విధ్వంసం జరిగిందం టూ ఆందోళనలు, నిరసనలు జరిగాయి. వన్యప్రాణులను మరో ప్రాంతానికి తరలించడం లాంటి చర్యలను వ్యతిరేకిస్తూ, ఈ క్రమంలో అటవీ నిర్మూలన జరిగిందంటూ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అదే సమయంలో సుమోటోగా కేసును స్వీకరించింది. దీనిపైఇప్పటికే రెండుసార్లు వాదనలు జరిగాయి. చెట్లను నరికని వంద ఎకరాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వంపై, అధికారులపై, సీఎస్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికే రాత్రే చెట్లను తొలగించడంపై తీవ్రస్థాయిలో మండిపడింది. అక్రమ నరికివేతకు కారణమైనట్లు తేలితే అదే ప్రాంతంలో ప్రత్యేక జైలు ఏర్పాటు చేసి దానిలోనే ఉంచుతామని సీఎస్‌తో సహా అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రణాళికను కోర్టుకు సమర్పించాలని కోరింది.