calender_icon.png 23 September, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా సాయి నియామకం

22-09-2025 10:44:21 PM

నాగారం: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా నాగారం మండల కేంద్రానికి చెందిన కొలిపాక సాయి కుమార్ ను నియమిస్తూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్  సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలు అభివృద్ధి పనులను సామాజిక మధ్యమాల ద్వారా ప్రజలలోకి చెరవేయాలని సూచించారు.రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.నూతనంగా నియమకమైన నియోజక వర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ను శాలువాతో సన్మానించారు.