23-09-2025 12:00:00 AM
నిర్మల్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వివిధ దేవాలయాల్లో సోమవారం పూజలు నిర్వ హించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కదిలి పాపేశ్వర ఆలయంతో పాటు బంగల్పేట మహాలక్ష్మి ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు అనంతరం నిర్మల్ పట్టణంలో కేక్ కట్ చేయగా కార్యకర్తలు నాయకులు ఆయనను ఘనంగా సన్మానం చేశారు.