calender_icon.png 12 January, 2026 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదరగొట్టిన సాయికిరీటి, ప్రవీణ్ కుమార్

11-01-2026 12:00:00 AM

టీసీఏ తెలంగాణ గోల్డ్ కప్

హైదరాబాద్ , జనవరి 10 : టీసీఏ తెలంగాణ గోల్డ్ కప్ హోరాహోరీగా సాగుతోంది. పలువురు యువ క్రికెటర్లు ఈ టోర్నీలో సత్తా చాటుతున్నారు. రెండురోజుల క్రితం సెంచరీ చేసిన దుర్గా ఉజ్వల్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసాడు. టీసీఏ వికా రాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఉజ్వల్ 3 వికెట్లు తీయడంతో పాటు 71(9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో రాణించాడు. దీంతో వికారాబాద్‌పై రంగారెడ్డి జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వికారాబాద్ బ్యాటర్ ప్రవీణ్ కుమార్ 81 (10 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్‌తో ఆకట్టుకున్నాడు. టీసీఏ సైబరాబాద్ జట్టు బౌలర్ జీవీ సాయికిరీటి అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభినవ్ సుదర్శన్(79), జాహ్నవ్ రెడ్డి (54) రన్స్‌తో చెలరేగడంతో సైబరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో టీసీఏ మేడ్చల్ అర్బన్ జట్టుపై విజయం సాధించింది.