11-01-2026 12:00:00 AM
రాజీవ్‌గాంధీ అండర్ 19 లీగ్
హైదరాబాద్, జనవరి 10 : ఎల్బీ స్టేడి యం వేదికగా మాజీ ఎంపి వీహెచ్ ఆధ్వర్యంలో జరిగిన 19వ రాజీవ్‌గాంధీ అండర్ 19 లీగ్ టీ20 క్రికెట్ చాంపియన్‌షిప్ 2026 లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో సీఎఫ్‌ఐ ఇండియాపై విజయం సాధించింది. వి జేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ బహుమతులు అందజేశారు.
యువత మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరం గా ఉండి మైదానం బాట పట్టాలని వారు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు క్రీడలతో ముడిపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు మెట్టు సాయికుమార్, శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నా యక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు మోతే రోహిత్, స య్యద్ సైపుల్లా తదితరులు పాల్గొన్నారు.